మచిలీపట్నం (Machilipatnam)లో జనసేన (Janasena) చోటా నాయకుడి రౌడీయిజం కలకలం రేపింది. తనకు సెల్యూట్ చేయలేదనే కారణంతో హోంగార్డు (Home Guard) పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతరాత్రి మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ (Vishwabrahmin) కాలనీలో బీట్ డ్యూటీ నిర్వహిస్తున్న హోంగార్డు మోహనరావు (Mohan Rao) పై ఈ దాడి జరిగింది. మోహనరావు డ్యూటీ సమయంలో అటుగా వెళ్తున్న జనసేన పార్టీ 8వ డివిజన్ ఇంచార్జి కర్రి మహేష్ (Karri Mahesh) హోంగార్డు తనను చూసి సెల్యూట్ చేయలేదని ఆగ్రహానికి లోనై, నోటికొచ్చినట్లు దుర్భాషలాడి దాడి చేశాడు.
“ఏంట్రా నేను వస్తే కూర్చుంటావా.. సెల్యూట్ కొట్టాలని తెలియదా? ఎస్పీ(SP)కి చెప్పినా..నా** పీకలేరు!” అంటూ రెచ్చిపోయి హోంగార్డు మోహనరావును తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడ్డ మోహనరావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఆయన, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక, కర్రి మహేష్ పై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మచిలీపట్నంలో చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు మోహనరావును పోలీస్ ఉన్నతాధికారులు సైతం పరామర్శించారు.