పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలైన బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై దాడి చేయడం. ఆ సమయంలో కారు అద్దాలు బద్దలు కొట్టి, వీరిపై నేరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ మార్పు తర్వాత తురకా కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు, అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసి, పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్టు!
by K.N.Chary
Published On: January 5, 2025 7:46 pm
---Advertisement---