అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని పరవాడ (Parawada) ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విష వాయువు లీకై కార్మికులు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. ఫార్మాసిటీలోని ప్రముఖ మెడిసిన్ తయారీ సంస్థ లూపిన్ ఫార్మా (Lupin Pharma) ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ (Toxic Gas Leak) కావడంతో ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సహచరులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. సంబంధిత శాఖలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. అయితే బాధిత కార్మిక కుటుంబాలు కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.







