ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ప్రస్తుతం ఒక కొత్త చర్చ మొదలైంది. టీడీపీ మద్దతుదారులు (TDP Supporters), జూ. ఎన్టీఆర్(Jr.NTR) అభిమానుల (Fans) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ వివాదానికి కారణం ఆగస్టు 14న రిలీజ్ కానున్న రజనీకాంత్ సినిమా కూలీకి మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా తెలిపిన శుభాకాంక్షలు.
అదే రోజున ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 (War 2) కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, లోకేశ్ చేసిన ట్వీట్ ఉద్దేశపూర్వకమని, వార్ 2 ప్రభావాన్ని తగ్గించడానికే ఈ ప్రయత్నమని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్