ఒక‌టి అని నాలుగు ప‌డ‌డం ఎందుకు లోకేష్‌?

ఒక‌టి అని నాలుగు ప‌డ‌డం ఎందుకు లోకేష్‌?

ఎన్నిక‌ల (Elections) స‌మ‌యంలో బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అని చెప్పి.. ఇప్పుడు కేవ‌లం ఐదు ర‌కాల బ‌స్సుల్లోనే ఫ్రీ ప‌థ‌కం అమ‌లు చేయ‌డాన్ని వైసీపీ(YSRCP) త‌ప్పుబ‌డుతోంది. తూతూ మంత్రంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని (Free Bus Scheme) అమ‌లు చేస్తూ మ‌హిళ‌ల‌ను మోసం చేస్తోంద‌ని వైసీపీ వాద‌న‌.

అయితే, స్త్రీ శక్తిపై వైసీపీ చేస్తున్న‌ ప్రచారాన్ని ఖండిస్తున్నాం అని ఇచ్చిన హామీపై వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా మాజీ సీఎం (Former CM) వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) కుటుంబ స‌భ్యులపై రాజ‌కీయ కామెంట్లు చేస్తోంది అధికార టీడీపీ(TDP). ఒక‌ప‌క్క మ‌హిళ‌లు అంటే గౌర‌వం అంటూనే జ‌గ‌న్ ఫ్యామిలీని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లకు పురిగొల్పడం అధికార టీడీపీ ద్వంద్వ విధానానికి అద్దం ప‌డుతోందంటున్నారు.

ఫ్రీ బ‌స్ ప‌థ‌కం ప్రారంభం స‌మ‌యంలోనూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. చెల్లితో రాఖీ క‌ట్టించుకోలేని వ్య‌క్తి అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు పార్టీలు, సిద్ధాంతాల వ‌ర‌కే ఉండాలి కానీ, కుటుంబ స‌భ్యుల గురించి మాట్లాడ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోకేష్ వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) వేసిన కౌంట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చంద్ర‌బాబు సిస్ట‌ర్స్‌, లోకేష్ మేన‌త్త‌లు ఇద్ద‌రు ”మీ తండ్రికి రాఖీ క‌ట్టారా..? ఇంటి శంకుస్థాప‌న‌కు నీ మేన‌త్త‌లు వ‌చ్చారా..? వ‌స్తే ప‌ట్టుచీర‌లు పెట్టారా..? మామూలు చీర‌లు పెట్టారా..?” అని మీడియా స‌మావేశంలో అంబ‌టి అడిగిన ప్ర‌శ్న‌లు నారా లోకేష్‌కు, తెలుగుదేశం పార్టీకి గ‌ట్టిగా త‌గిలాయి. ”వైఎస్ జ‌గ‌న్‌ను ఒక‌టి అని నాలుగు మాట‌లు ప‌డ‌డం’ ఎందుక‌ని ఉచిత స‌ల‌హా ఇస్తున్నారు.

ఎవ‌రి కుటుంబంలోనైనా విభేదాలు, త‌గాదాలు స‌ర్వ‌సాధార‌ణంగా ఉంటాయి.. ఉంటూనే ఉంటాయి. ఇది వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌తీ రాజ‌కీయ వేదిక‌పై జ‌గ‌న్ కుటుంబాన్ని, ఆయ‌న త‌ల్లిని, చెల్లిని తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నేత‌లు మాట్లాడ‌డం స‌మంజ‌సం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మంగ‌ళ‌గిరిలో త‌న మెజార్టీ గురించి మాట్లాడిన లోకేష్‌.. త‌న‌కు తానుగానే ట్రోల్ అయ్యాడు.

చంద్ర‌బాబు నాయుడి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నారా లోకేష్‌.. నారా అని ఇంటి పేరు పంచిన త‌న తాత ఖ‌ర్జూర నాయుడు, నాన‌మ్మ అమ్మ‌న‌మ్మ పేర్ల‌ను ఎందుకు ప్ర‌స్తావించ‌రు..? అని ప్ర‌శ్నిస్తే స‌మాధానం ఉంటుందా..? తాత‌ ఖ‌ర్జూర‌నాయుడుకు ఉన్న ఆస్తిలో మేన‌త్త‌ల‌కు ఎంత భాగం పంచిచ్చారు..? అని నిల‌దీస్తే నీళ్లు న‌ములుతారుగా..? ఎందుకు ఒక మాట అని నాలుగు మాట‌లు ప‌డ‌డం, రాజ‌కీయ వేదిక‌ల‌పై నాయ‌కుల‌ను, వారి పార్టీ సిద్ధాంతాల‌ను విమ‌ర్శిస్తే స‌రిపోతుంది కానీ, వ్య‌క్తిత్వాల‌ను, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడడం భ‌విష్య‌త్తులో తీవ్ర ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌ని, దీన్ని ఆదిలో తుంచితే అంద‌రికీ మంచిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment