కూల్‌డ్రింక్ (Cool Drink) తాగుతున్న సమయంలో బాటిల్లో బల్లి (Lizard) భాగం కనిపిస్తే మీకేమనిస్తుంది.. ఎలా రియాక్ట్ అవుతారు..? అసలు ఊహించడానికే కష్టంగా ఉంది కదా.. అయితే సంగారెడ్డి (Sangareddy) జిల్లా పెద్దాపూర్‌లో ఈవిధమైన ఘటన రియల్‌గా జరిగింది. ఓ హోటల్ (Hotel) లోకి వెళ్లిన యువకులు థమ్స్ అప్ (Thums Up) తాగుతుండగా బాటిల్లో బల్లి కాలు (Lizard Leg) కనిపించి షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించి, వారితో వాదనకు దిగారు. ఈ సంఘటనతో ఒక యువకుడు అస్వస్థతకు గురై ఆస్పత్రి (Hospital)లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు (Food Safety Officials) ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు హోటల్‌ను పరిశీలించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News Wire
-
01
అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ
6,212 ఎకరాల భూ సేకరణకు క్యాబినెట్ ఆమోదం. కంతేరులో 974 ఎకరాలు, తాడికొండలో 5,238 ఎకరాలు సేకరణకు ఆమోదం
-
02
స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన రేవంత్
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్. స్టీల్ బ్రిడ్జి కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం
-
03
కొండా సురేఖ బర్తరఫ్
మంత్రి కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పదవి నుంచి బర్తరఫ్. రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్.
-
04
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్
మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు చెప్పిన ఖర్గే! రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు సిద్ధమవుతున్న సీఎం
-
05
సీఎం రేవంత్‌పై కొండా సురేఖ ఫైర్
నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు. నాపై చర్యలు తీసుకునే కంటే ముందు సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి.
-
06
పవన్ బర్త్ డే వేడుకల్లో విషాదం
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అమలాపురంలోని ఓ కాలేజీ దగ్గర ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ప్రేమ్ కుమార్ మృతి
-
07
పవన్‌కు చిరంజీవి బర్త్ డే విషెస్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ట్వీట్. ప్రజల కోసం పని చేస్తున్నాడని కితాబిస్తూ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
-
08
ఇడుపులపాయలో వైఎస్సార్ వర్ధంతి
వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు
-
09
ఏపీలో సర్ గడువు పెంపు
ఈనెల 10 వరకు సర్ గడువు పెంచిన ఎస్ఈసీ. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం. 9న తుది జాబితా
-
10
హైకోర్టు కు HYDRAA కమిషనర్
HYDRAA కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.. సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్.









కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్