భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీ క్రికెటర్లు సరైన ఫేర్వెల్ లేకుండా క్రికెట్ కెరియర్‌ను వీడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది.
యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, శిఖర్ ధవన్ వంటి ప్రముఖ క్రికెటర్లు తమ కెరీర్ చివర్లో గుర్తుండిపోయే ఫేర్వెల్ పొందలేకపోయారు.
ఈ క్రికెటర్లు దేశం కోసం ఆడిన విధానం, వారి కృషి, విజయాలలో కీలక పాత్రలు పోషించిన తీరు అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. కానీ, వీరు చివరి మ్యాచ్ ఆడే అవకాశం లేకుండా లేదా గుర్తుండిపోయే వీడ్కోలు కార్యక్రమం లేకుండా క్రికెట్‌ను వీడడం అభిమానులకు నిరాశ కలిగించే అంశంగా మారింది.