క్ష‌మించండి.. నేనుంటే మైక్ లాక్కునేవాడ్ని – విశ్వ‌క్‌సేన్

క్ష‌మించండి.. నేనుంటే మైక్ లాక్కునేవాడ్ని - విశ్వ‌క్‌సేన్

లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో న‌టుడు క‌మ్ జ‌న‌సేన పార్టీ లీడ‌ర్ ఫృథ్వీ (Prithviraj) చేసిన వ్యాఖ్య‌ల‌కు చిత్ర యూనిట్ దిగివ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఫృథ్వీ ‘లైలా' ప్రీ రిలీజ్ (Laila PreRelease) ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్య‌లపై చిత్ర యూనిట్ అత‌నిపై సీరియ‌స్ అయ్యింది. ఎవ‌రో చేసిన త‌ప్పున‌కు సినిమాను బ‌లి చేయొద్దు అని హీరో విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen) విజ్ఞ‌ప్తి చేశారు. పృథ్వీ మాట్లాడింది విని చాలా షాక్ అయ్యామ‌ని, ఆయ‌న ఏం మాట్లాడారో కూడా త‌నకు తెలియదని, మాట్లాడినప్పుడు తాను అక్కడ లేనని చెప్పారు. ఉండి ఉంటే వెంట‌నే మైక్ లాక్కునేవాడిని అంటూ విశ్వ‌క్‌సేన్ అన్నారు.

ఫృథ్వీ వ్యాఖ్య‌లకు త‌మ సినిమాకు ఎలాంటి సంబంధం లేద‌ని, కానీ, లైలా సినిమా ఈవెంట్‌లో ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు కాబ‌ట్టి క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నామ‌న్నారు. ఫృథ్వీ సినిమాలో న‌టుడు మాత్ర‌మేన‌ని, అత‌నితో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ద‌య‌చేసి సినిమాను బాయ్‌కాట్ (BoycottLaila) చేయొద్ద‌ని కోరారు. లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తున్న‌ట్లుగా వేల‌లో ట్వీట్ చేశార‌ని చెప్పారు.

హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో న‌టుడు ఫృథ్వీ 150 మేక‌లు చివ‌ర్లో 11 మేక‌లు అయ్యాయ‌ని వైసీపీపై ఇండైరెక్ట్‌గా వ్యాఖ్య‌లు చేశారు. దీనికి ప్ర‌తిగా వైసీపీ అభిమానులు లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తున్న‌ట్లుగా ట్విట్ట‌ర్ వేదిక 59 వేల ట్వీట్‌లు పెట్టారు. బాయ్‌కాట్‌లైలా హ్యాష్‌ట్యాగ్ ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌ (Trending)లో ఉంది. దీంతో చిత్ర యూనిట్ దిగివ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment