కర్నూలు (Kurnool) జిల్లా చిన్నటేకూరు (Chinnatekur) సమీపంలో జరిగిన ఘోర (Terrible) బస్సు ప్రమాదం (Bus Accident)పై రాష్ట్ర హోంమంత్రి (Home Minister) అనిత (Anitha) స్పందించారు. ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బస్సు డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. “మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. DNA శాంపిల్స్ ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. ప్రమాదం నుంచి మొత్తం 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం 16 ఫోరెన్సిక్ టీమ్‌లు ఘటనాస్థలిలో పనిచేస్తున్నాయి. బస్సుకు ఆలిండియా పర్మిట్, ఫిట్‌నెస్ పత్రాలు ఉన్నాయని ధృవీకరించాం” అని తెలిపారు.
“ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 6 గంటలకు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించాం. బస్సులో మొత్తం 36 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో బాపట్ల, నెల్లూరు, కోనసీమ జిల్లాల వారు ఉన్నారు. ఇంకా ఒక మృతదేహం గుర్తించాల్సి ఉంది. బాధితుల కుటుంబాలతో ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని హోంమంత్రి అనిత అన్నారు.





 



