లార్డ్స్ టెస్టు (Lord’s Test)లో భారత్ (India) గెలవాలంటే మరో 135 పరుగులు చేయాలి, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, ఆ క్రెడిట్ అంతా కేఎల్ రాహుల్ (KL Rahul)కే దక్కుతుందని భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) అన్నారు. రాహుల్ ‘యాంకర్’ పాత్ర పోషించి, చివరి వరకు క్రీజులో ఉండాలని ఆయన సూచించారు. ఇంగ్లాండ్‌పై విజయం సాధించాలంటే రాహుల్ వికెట్ ఇవ్వకుండా చివరి వరకు ఆడాలని కుంబ్లే స్పష్టం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే నిలకడను ప్రదర్శించాడని ఆయన ప్రశంసించారు.
నాజర్ హుస్సేన్ వ్యాఖ్యలు:
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ బౌలర్లకు కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్ పెద్ద సవాలని పేర్కొన్నారు. పంత్ ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడతాడని, వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ బౌలర్లు ఒత్తిడిలో ఉంటారని తెలిపారు. ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోతే ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ వైపే 52-48 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని హుస్సేన్ అంచనా వేశారు.