‘కుబేర’ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్

'కుబేర' కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వ‌హిస్తుండ‌గా, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) మరియు రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.

కుబేరా సినిమా విడుదల డేట్ కూడా సమీపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో, ఈ చిత్రం ప్రమోషన్లలో మేకర్స్ జోరును పెంచారు. ఇందులో భాగంగా ‘కుబేర’ మూవీ టీమ్ కౌంట్ డౌన్ పోస్టర్‌ (Poster)ను విడుదల (Released) చేసింది. ఈ పోస్టర్‌లో హీరో ధనుష్, హీరోయిన్ రష్మిక మందన్న ఓ రాయి మీద కూర్చొని ఉన్నారు. ధనుష్ తన పక్కన ఉన్న రష్మికను చూస్తుండగా, ఆమె కిందకు చూస్తూ ముసి ముసి నవ్వుతూ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment