కంగ్రాట్స్‌.. రాహుల్‌గాంధీపై కేటీఆర్ సెటైర్లు

కంగ్రాట్స్‌.. రాహుల్‌గాంధీపై కేటీఆర్ సెటైర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ హ‌వా కొన‌సాగుతుంది. కాగా, ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా సాధించ‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైట‌ర్లు వేశారు.

ఢిల్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇంపాక్ట్‌పై సెటైరిక్‌గా స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ.. ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ బీజేపీ గెలిపించారు. వెల్ డ‌న్ అంటూ కేటీఆర్ త‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇప్పటివరకు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేకపోయింది. బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment