తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసే భారీ కుంభకోణాన్ని (Big Scam) బయటపెడతానని ఆయన ప్రకటించారు (Announced). ఇది కేవలం 400 ఎకరాల వ్యవహారమే కాదు.. వెనుక వేల ఎకరాల భూముల అక్రమ లావాదేవీలు (Illegal Transactions) ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ (BJP-MP) కీలక పాత్ర పోషిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. “రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ – ఢిల్లీ చేతిలో ఉన్న బొమ్మలే. ఒకరు చెప్పులు మోస్తే, మరొకరు బ్యాగులు మోస్తున్నారు” అంటూ ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
మంత్రి పొంగులేటిపై సెటైర్లు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేలుస్తానన్న బాంబులు తుస్సు అయిపోయాయని, అందుకే ఆయన సైలెంట్ అయిపోయారని ఎద్దేవా చేశారు. నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, ఎఐ వీడియోలు పేరిట నిర్దోషులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
హెచ్‌సీయూ, మూసీ కేసులపై ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ యూనివర్శిటీలో (HCU) జంతువుల వ్యధకు కారణమైన వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. జూపార్క్ నివేదిక ప్రకారం జింకలు, నెమళ్లు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. గంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వమే కోర్టులను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.
సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నాహకాలు
బీఆర్ఎస్ 25 ఏళ్ల చరిత్రను పురస్కరించుకొని వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఇది పార్టీ చరిత్రలోనే అతిపెద్ద సభ అవుతుందని తెలిపారు. డిజిటల్ మెంబర్‌షిప్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని తెలిపారు. వరంగల్ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.








