తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుంది రేవంత్ ప్రభుత్వం: కేటీఆర్

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుంది రేవంత్ ప్రభుత్వం: కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) విషం చిమ్మిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసి, ఎన్నికల తర్వాత కూడా దానిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు:

కాళేశ్వరంపై కక్ష సాధింపు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష కట్టి, సిబిఐ(CBI) విచారణకు ఆదేశించారు. అయితే, వారం తిరగకముందే మల్లన్న సాగర్ (Mallanna Sagar) నుంచి నీళ్లు (Water) తెస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపన తోక దగ్గర చేస్తున్నారని, మల్లన్న సాగర్ వద్ద శంకుస్థాపనకు మొహం చెల్లక గండిపేట దగ్గర డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.

అబద్ధాలు చెప్పి క్షమాపణలు చెప్పాలి: కాళేశ్వరం ‘కూలేశ్వరం’ అని చెప్పిన వాళ్లే ఈరోజు అక్కడి నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు మంచి నీళ్లు తెస్తున్నారని, ఇది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాలు తెస్తున్నారా లేదా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి, విష ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిధుల దుర్వినియోగంపై వివరణ: కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారని, కానీ మొత్తం రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే కేవలం రూ.250 కోట్ల పని దగ్గర మాత్రమే రిపేర్లు వచ్చాయని కేటీఆర్ వివరించారు. కూలిన చోట ఏజెన్సీ రిపేర్ చేయడానికి ముందుకొచ్చినా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment