ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case)లో వెలువడిన తాజా తీర్పుపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, అలాగే బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయడానికి ఈ అక్రమ కేసును సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని కేటీఆర్ విమర్శించారు.
కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులపై మోపిన ప్రతి కేసు అబద్ధమని, అది కేవలం కల్పితమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత (K. Kavitha)కు కోర్టులో న్యాయం లభించడాన్ని కేటీఆర్ స్వాగతించారు. తమ పార్టీ నాయకులపై మోపిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా వీడిపోతాయని, చివరకు నిజం నిలకడగా తెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ(BJP)లు కలిసి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషం చిమ్మాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములై “మీడియా ట్రయల్స్” నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించాయని ఆయన విమర్శించారు. సాక్ష్యాధారాల కంటే ఆరోపణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
The AAP Govt led by Kejriwal was brought down in the name of the so-called liquor scam, and the political casualty of that narrative was the Bharat Rashtra Samithi in both the Assembly & Parliament elections
— KTR (@KTRBRS) February 27, 2026
Kavita Garu got justice in court today and In the same manner, every…








