బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత పదేళ్లలో రైతులు ఎదుర్కోని యూరియా కొరత సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చేతకాని ప్రభుత్వం వల్ల రైతులు (Farmers) దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కొరతపై కేటీఆర్ ఆరోపణలు
ప్రణాళిక లోపం: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆరు నెలల ముందుగానే యూరియా(Urea) బస్తాలను సిద్ధం చేసేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కనీస ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. బ్లాక్ మార్కెటింగ్‌పై అనుమానాలు: కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ మార్కెట్‌లో యూరియా అమ్ముకుంటున్నారనే అనుమానం ఉందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతుండగా, గ్రామాల్లో మాత్రం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తుందని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాల మీద లేదు – కేటీఆర్ pic.twitter.com/Ww1gdhKaYH
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2025
ఢిల్లీ(Delhi) యాత్రలపై విమర్శలు: ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలిసి ఏదో ఒక పత్రం ఇచ్చి వస్తున్నారని, కానీ ఇక్కడ రైతులు యూరియా కోసం పోలీసుల పహారాలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం ధర్నాలు చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. గతంలో లేని ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం “దున్నపోతు మీద వాన కురిసినట్లు” వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.








