తెలంగాణ (Telangana)లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైఖరిని “రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికే ఉన్న హైదరాబాద్ (Hyderabad)ను అభివృద్ధి చేయలేని ప్రభుత్వం, కొత్తగా ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలకైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గ్యారంటీ కార్డులతో మోసం చేసిందని ఆరోపిస్తూ, దానికి బదులుగా ‘బాకీ కార్డు’లను ఇంటింటికి పంపిణీ చేయాలని తమ పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.








