కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజలను మోసగిస్తోందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జరిగిన భద్రాచలం (Bhadrachalam) నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికిపందలుగా మారారని, కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
అలాగే, బీజేపీ(BJP)పై కూడా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. వక్ఫ్ చట్టం (Waqf Law)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను స్వాగతించిన తమ పార్టీని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం ఆ పార్టీ ‘నకిలీ జాతీయవాదం’కి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు.








