ఫైళ్ల క్లియ‌రెన్స్‌కు మంత్రుల‌కు క‌మీక్ష‌న్లు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

ఫైళ్ల క్లియ‌రెన్స్‌కు మంత్రుల‌కు క‌మీక్ష‌న్లు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. వరంగల్‌ (Warangal) లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో కొందరు మంత్రులు (Some Ministers) ఫైళ్ల క్లియరెన్స్ (Files Clearance) కోసం డబ్బులు (Money) తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొందరు మంత్రులు ఫైళ్లు క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. ఇది చాలా సాధారణంగా జరిగేది. నా దగ్గరకు కూడా ఒక కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. నేను వాళ్లతో ‘మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు, ఆ డబ్బుతో సమాజ సేవ చేయండి’ అని చెప్పాను” అని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. మంత్రిగా ప‌నిచేస్తూ ఇవేం మాట‌లు అంటూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నుంచి కూడా తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. కొండా సురేఖ క‌మీష‌న్ల వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ (BRS) నుంచి కూడా కౌంట‌ర్లు ప‌డ్డాయి. అయితే ఆమె తన వ్యాఖ్యల వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించినవని స్పష్టం చేశారు. “నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి, ప్రస్తుత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆమె ఒక ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment