చంద్రబాబు ఫ్యామిలీకి కొన “తాళం”

చంద్రబాబు ఫ్యామిలీకి కొన “తాళం”

చంద్రబాబు కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తితే.. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసన్నం అవుతాడని భావించారేమో ఏమో కానీ కొణతాల రామకృష్ణ నిన్న అసెంబ్లీలో చంద్ర‌బాబు ఫ్యామిలీ భజన చేశారు.

లోకేష్ నే కాదు..దేవాన్ష్ ను సైతం..
ఒక్క నిమిషంలో ముగిస్తానంటూ మొదలు పెట్టిన కొణతాల బాబు కుటుంబాన్ని ఆకాశానికెత్తడానికి ఎక్కడలేని ఉత్సాహం చూపించారు. మొన్ననే చూశా నాకు పోటీ నా ఇంట్లో సభ్యులే అని నారా లోకేష్ అన్న వీడియో చూశాను. నారా దేవాన్ష్ పది ఏళ్లకే చైల్డ్ పొడిగిగా..చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది. వరల్డ్ బుక్ రికార్డ్స్ లో నమోదు చేసుకున్న దేవాన్ష్ కు లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్ లో వారికది ప్రదానం చేశారు. చిన్న వయసులో అది రావడం సామాన్యమైన విషయం కాదు..అంటూ దేవాన్ష్ గురించి ఏకరువు పెట్టారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణికి కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన అవార్డులు కొన్నింటిని ప్రస్తావించారు.

సీటు ఇచ్చిన పవన్ పేరును ప్రస్తావించని కొణతాల
వాస్తవానికి ఒకరకంగా రాజకీయంగా కనుమరుగై పోయిన స్థితిలో జనసేన, పవన్ కల్యాణ్ ఇచ్చిన సీటుతో మళ్లీ అసెంబ్లీ మెట్లెక్కిన కొణతాల తన పార్టీని, నాయకుడిని పక్కన పెట్టి బాబు ఫ్యామిలీకి ఈ రకంగా భజన చేయడం చూసి నివ్వెరపోవడం జనసేన సభ్యుల వంతైంది. ఉత్తరాంధ్ర నాయకుడైన కొణతాల తమ ప్రాంత సమస్యలు ప్రస్తావించి.. వాటి పరిష్కరానికి కృషి చేయాల్సింది పోయి.. ఈ భజన కార్యక్రమాలు చేయడం ఏంటని పలువురు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment