భ‌ట్టి విక్ర‌మార్కకు థ్యాంక్స్ – రాజ‌గోపాల్‌రెడ్డి ట్వీట్ వైర‌ల్‌

ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ (Telangana) రాజ‌కీయాల్లో (Politics) మునుగోడు ఎమ్మెల్యే, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సంచ‌ల‌నంగా మారారు. తాజాగా, రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హామీ ఇచ్చారని, ఇది నిజమేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసినందుకు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

“కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధిష్టానం నాకు మంత్రి పదవి (Minister Post) ఇస్తామన్న హామీని రాష్ట్ర ముఖ్య నాయకులు అడ్డుకుంటూ, నన్ను అవమానిస్తున్న విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు (Thanks). నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగించాలని ఆశిస్తున్నాను.”ఆయ‌న ట్వీట్ చేశారు.

ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజ‌గోపాల్‌రెడ్డి వ్య‌వ‌హార‌శైలి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొద‌ట త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చిన మునుగోడు ఎమ్మెల్యే.. అధిష్టానం నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో.. తాను ప‌ద‌వుల కోసం ఎవ‌రి కాళ్లు మొక్క‌ను అని వ్యాఖ్యానించారు. అయితే ఇది డైరెక్ట్‌గా సీఎం(CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని టార్గెట్ చేసిన‌ట్లుగా ఆ పార్టీ నేత‌లే మాట్లాడుకోవ‌డం గ‌మనార్హం. తాజాగా త‌న‌కు గ‌తంలో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్న మాట వాస్త‌వ‌మ‌ని ఒప్పుకున్నందుకు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు రాజ‌గోపాల్‌రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment