తెలంగాణ (Telangana) సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని విడదీయాలన్న కుటిల ప్రయత్నంగా అభివర్ణిస్తూ, తెలంగాణ సమాజం ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు సహించదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
ట్విట్టర్ వేదికగా రాజగోపాల్ రెడ్డి
“ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప, అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచీ తన శక్తి మేరకు పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు (Journalists) నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలన్న ప్రయత్నాలు, ప్రథాన మీడియాలో వారిని అపహాస్యం చేయడం, విభజించి పాలించే రాజకీయమే.” అని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
అయన మాట్లాడుతూ:
“ఈ రోజుల్లో ఎవరు పడితే వారు సోషల్ మీడియా జర్నలిస్టులని గొప్పలు చెబుతున్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీ కూడా రాయలేని వారు మీడియాలోకి వచ్చారు. నన్ను చూసి నమస్కారం పెట్టలేరు, తల వంచలేరు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. స్టేజీ దిగి చెంపలు చెళ్లుమనిపించాలని అనిపిస్తది… కానీ నాకు ఉన్న హోదా అడ్డం వస్తుంది.”
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా, సోషల్ మీడియా వేదికగా ప్రజల ఆవేదనను వెలిబుచ్చే జర్నలిస్టులపై తప్పుడు దృష్టికోణాన్ని చూపించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఈ అంశం పై చర్చనీయాంశంగా మారింది.