డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్

కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తిరుపతికి చెందిన శ్రీకాంత్, సినిమాలపై ఆసక్తితో చిన్నప్పుడే చెన్నై వెళ్లి, శ్రీరామ్‌గా పేరు మార్చుకొని సినీ రంగ ప్రవేశం చేశారు. ‘రోజా పూలు’ సినిమాతో హీరోగా తెలుగు, తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘ఒకరికి ఒకరు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీరామ్, ఇటీవల ‘హరికథ’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.

అరెస్ట్, విచారణ వివరాలు:
చెన్నై పోలీసులు శ్రీరామ్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి, చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు సుమారు రెండు గంటల పాటు విచారించారు.

మాజీ AIADMK కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో అన్నాడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్‌తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతోనే శ్రీరామ్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, శ్రీరామ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘స్నేహితులు’ సినిమాలో జీవాతో కలిసి నటించారు. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment