---Advertisement---

గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? – కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌

గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? - కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌
---Advertisement---

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయితే ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హామీలపై ప్రశ్నలు
‘‘ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టులాంటిది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఆరోపణలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ప్రజలే వాళ్లను నిలదీసే సమయం వచ్చింది’’ అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment