కిరణ్ అబ్బవరం కొత్త సినిమాపై ఆసక్తికర చర్చ!

హారరా? మిస్టరీ థ్రిల్లరా? కిరణ్ అబ్బవరం కొత్త సినిమాపై ఆసక్తికర చర్చ!

Summarize with AI

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథల ఎంపికలోనూ, సినిమాల విషయంలోనూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా విభిన్న కాన్సెప్ట్‌లు, కొత్త జానర్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’తో జోష్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం.. జీ స్టూడియోస్ (Zee Studios) నిర్మాణంలో తెరకెక్కనున్న పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ చిత్రం (Mythological Action-Fantasy) ‘ఇంద్రపుత్ర’ను (Indraputra) కూడా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.

మరోవైపు కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి విభిన్న ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన కిరణ్ అబ్బవరం.. తాజాగా పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో(Pournami Entertainments) కలిసి మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రకటించారు. కిరణ్ అబ్బవరం సమర్పిస్తున్న ఈ సినిమాకు అనుష్ గోరక్(Anush Gorak) దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ అబ్బవరం, వై. శివశంకర్ నాయుడు (Y. Shivashankar Naidu) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవి, తనుజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటించనున్నారు.

అయితే ఈ సినిమా ప్రకటనలోనే మేకర్స్ ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా కొత్త చిత్రాన్ని ప్రకటించే సమయంలో టైటిల్, హీరో-హీరోయిన్ వివరాలు లేదా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కథకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించకుండా.. పక్షి కాళ్లను పోలిన భయానక ఆకారంతో కూడిన పోస్టర్‌ను మాత్రమే విడుదల చేశారు.

దీంతో ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇది హారర్, మిస్టరీ థ్రిల్లర్, ఫాంటసీ లేదా పూర్తిగా కొత్త జానర్‌లో తెరకెక్కుతున్న సినిమానా అనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కథ, జానర్‌ను పరిచయం చేయబోతున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి.

సినిమా టైటిల్, కథ, నటీనటుల పూర్తి వివరాలను రాబోయే రోజుల్లో దశలవారీగా వెల్లడించే అవకాశం ఉంది. తొలి పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం నిజంగా ఎలాంటి కొత్త అనుభూతిని అందించబోతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment