---Advertisement---

‘టాక్సిక్’ కోసం కియారా అదిరిపోయే డీల్

'టాక్సిక్' కోసం కియారా అదిరిపోయే డీల్
---Advertisement---

రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు కియారా ఏకంగా రూ.15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ రెమ్యునరేషన్‌తో కియారా టాలీవుడ్, బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల జాబితాలో చేరిపోయింద‌ని అంటున్నారు. మరోవైపు, మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న SSMB29 కోసం ప్రియాంకా చోప్రా రూ.30 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

ప్రెగ్నెంట్‌గా ఉన్న కియారా అద్వానీ ప్రస్తుతం తాను అగ్రిమెంట్ చేసుకున్న రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి ముందు విడుద‌లైన ‘గేమ్ ఛేంజర్’ మూవీలో న‌టించిన కియారా అద్వానీ, కేజీఎఫ్ స్టార్ యశ్‌తో ‘టాక్సిక్’ మూవీలో నటిస్తోంది. అలాగే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలో సెట్స్‌పై ఉన్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment