సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ (Account Hacked) అయ్యింది. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ట్విట్టర్ హ్యాక్ చేసిన వ్యక్తి ఖుష్బూకి వాట్సాప్‌లో సందేశం పంపాడట. “హాయ్ ఖుష్బూ. నీ ట్విట్టర్ ఖాతాను నేనే హ్యాక్ చేశా. కానీ ఇది మాకు ఉపయోగపడదు” అంటూ హ్యాకర్ మెసేజ్(Hacker Message)లో పేర్కొన్నాడ అని ఆమె తెలిపింది.
ఎక్స్ హ్యాక్ అయిన సంఘటన, హ్యాకర్ నుంచి నేరుగా వాట్సాప్ మెసేజ్ వచ్చిన విషయాన్ని ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమిళనాడు సైబర్ క్రైమ్ అధికారులను (Tamil Nadu Cyber Crime officials) సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ట్విట్టర్ అకౌంట్‌ల భద్రతపై ఈ సంఘటన మరోసారి ప్రశ్నలు రేపుతోంది.