కేరళ సీఎం కుమార్తెకు కేంద్రం షాక్‌.. విచారణకు గ్రీన్ సిగ్నల్

కేరళ సీఎం కుమార్తెకు కేంద్రం షాక్‌.. విచారణకు గ్రీన్ సిగ్నల్

కేరళ (Kerala) ముఖ్యమంత్రి (CM) పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)కు ఊహించ‌ని షాక్ తగిలింది. ఆయన కుమార్తె (Daughter) టి.వీణ విజయన్‌ (T. Veena Vijayan)పై కేంద్ర ప్రభుత్వం విచారణకు (Investigation) అనుమతి (Permission) ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) నుంచి అక్రమంగా నగదు బదిలీ జరిగినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO) ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

వీణ విజయన్‌కి చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌’ అనే సంస్థకు 2017 నుంచి 2020 మధ్య కాలంలో CMRL నుంచి రూ. 1.72 కోట్లు అక్రమంగా బదిలీ చేసినట్లు ఎస్ఎఫ్ఐఓ విచారణలో వెల్లడైంది. కంపెనీ చట్టాల ఉల్లంఘన కింద వీణతో పాటు సీఈవీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా (Sasidhar Karta) సహా మరో 25 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

ఈ కేసులో వీణ విజయన్ దోషిగా తేలితే, పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం నుంచి విచారణకు అనుమతి రావడంతో, ఈ వ్యవహారం రాజకీయంగా కేరళలో దుమారం రేపనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment