---Advertisement---

‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

'ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..' - కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌
---Advertisement---

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు ప‌న్నుతోంద‌ని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే బీజేపీ 11,000 ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 12,500 ఓట్లను తొలగించాలని కూడా వారు ప్రయత్నించారు” అని వివరించారు. ఈ విషయాన్ని తమ పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ) దృష్టికి తీసుకెళ్లిందని కేజ్రీవాల్ తెలిపారు. ఈసీకి తెలియజేయడం వల్ల, బీజేపీ ఆటలను ఆపగలిగాం. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడాన్ని సహించేది లేద అంటూ కేజ్రీవాల్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

బీజేపీ కుట్రలను ధిక్కరిస్తూ, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మున్ముందు మరింత కఠినంగా పోరాడుతుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. త్వ‌ర‌లో జ‌రగ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఇంటింటి ప్ర‌చారం చేప‌ట్టింది. ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల‌కు ప‌లు హామీలు కురిపిస్తున్న ఆప్‌పై బీజేపీ గుర్రుగా ఉంది. ఇటీవ‌ల ఢిల్లీ సీఎంను అరెస్టు చేయొచ్చు, ప‌లువురి ఇళ్ల‌పై సోదాలు జ‌ర‌గ‌వ‌చ్చు అని అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment