ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. అక్రమ కేసులు పెట్టి ప్రస్తుత ఢిల్లీ సీఎం ఆతిశీని త్వరలో అరెస్టు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు.
महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024
अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया है
उसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी
आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।
ముఖ్యమంత్రి ఆతిశీ సంజీవని యోజన మరియు మహిళా సమ్మాన్ యోజన పథకాలు ప్రకటించారని, ఆ పథకాలు ప్రజల్లో గొప్ప ఆదరణ పొందాయని, కానీ కొంతమంది ఈ పథకాలను తిప్పి వేయాలనే యత్నం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆతిశీపై నకిలీ కేసు పెట్టి ఆమెను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేజ్రీవాల్ సంచలన పోస్టు చేశారు. అంతేకాకుండా త్వరలో ఆప్ నేతల ఇళ్లలో కూడా సోదాలు జరగవచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఢిల్లీలో మహిళలకు నెల నెలా రూ.2100 నగదు ఇచ్చే మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ ఏదీ లేదని, స్కీమ్ పేరుతో ఎవరైనా ప్రజల సమాచారం సేకరించడం నేరమని మహిళా,శిశు సంక్షేమ శాఖ జారీ చేసిన ప్రకటన వివాదానికి కారణంగా నిలుస్తోంది.