మృత్యు టోల్‌గేట్.. కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా (Video)

మృత్యు టోల్‌గేట్.. కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా (Video)

ఎన్టీఆర్ జిల్లా (NTR District) కీసర టోల్‌ప్లాజా (Keesara Toll Plaza) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Severe Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. టోల్‌గేట్ దాటుతున్న సమయంలో మృత్యువు సిమెంట్ ట్యాంకర్ రూపంలో కారును కబళించింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర టోల్‌ప్లాజా వద్ద బీఎండ‌బ్ల్యూ కారుపై (BMW Car) కాంక్రీట్ రెడీమిక్సర్ (సిమెంట్ ట్యాంకర్) లారీ (Mix Truck) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయ‌య‌ని, ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టుగా స‌మాచారం.

అసలేం జరిగింది?
విజయవాడ నుండి హైదరాబాద్ (Hyderabad) వైపు వెళ్తున్న కారు కీసర టోల్‌ప్లాజా వద్ద సిమెంట్ ట్యాంకర్ (Cement Tanker) ఒక్కసారిగా కారుపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ట్యాంకర్ బరువుకు కారు రేకు ముక్కలా నలిగిపోయింది. కారు లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే టోల్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక దళం అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ కారుపై పడి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రమాదానికి గురైన కారును హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ఆయన ఎల్లారెడ్డిగూడలోని మూర్తి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. సిమెంట్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కారుపైకి ఎక్కించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment