ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) రాజకీయాల్లోకి (Politics) అడుగుపెట్టబోతోందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి, ‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు (Award) అందుకున్న కీర్తి, ఇటీవల మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడ అభిమానులు ఆమెను చూసి “టీవీకే.. టీవీకే” అంటూ నినాదాలు చేశారు. నటుడు విజయ్ (Vijay) కొత్తగా ప్రారంభించిన ‘తమిళగ వెట్రి కళగమ్’ (TVK) పార్టీలో కీర్తి సురేష్ చేరబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో విజయ్‌తో కలిసి రెండు చిత్రాల్లో నటించిన కీర్తి, తన వివాహం తర్వాత సినిమా అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది.
ఈ వార్తలపై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీ (Vijay Party)లో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం ఊపందుకుంది. కీర్తి సురేష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆమె నిర్ణయం ఏమిటో చూడాలి.








