---Advertisement---

మంచి అవ‌కాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?

మంచి అవ‌కాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?
---Advertisement---

తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు రూ. 12,000 మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్‌ను మరోసారి విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనితో, రైతుభరోసా పథకంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం ఉధృతమవుతోంది.

రైతు సమస్యలపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ కంటే రూ.3 వేలు త‌క్కువ ఇస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డంపై రైతులు, వామ‌ప‌క్షాలు, రైతు సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ మాత్రం దీనిపై ప‌త్రికా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ విషయంలో మౌనం పాటించడం వల్ల కాంగ్రెస్‌ను విమ‌ర్శించి, ప్ర‌జ‌ల్లో మైలేజ్ సాధించి ఒక మంచి అవకాశం వృథా అవుతుంద‌ని ప‌లువురు బీఆర్ఎస్ శ్రేణులే విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన కేసీఆర్‌ రైతుభరోసా విషయంలో స్పందించి, ఈ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిల‌దీయ‌డం ద్వారా రాజకీయంగా వృద్ధి సాధించవచ్చు. కాగా, రైతు భ‌రోసా విష‌యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment