తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎవ్వరూ ఊహించని ఫలితం ఒకటి వెలువడింది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుదారులు జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీను కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు.
వడ్డేపల్లిలో అనూహ్య ఫలితాలు
మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసిన కవిత అనుచరులు 8 వార్డులను గెలుచుకున్నారు. మిగతా రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి గెలుపొందాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడిచినప్పటికీ, వడ్డేపల్లిలో మాత్రం మూడో శక్తిగా కవిత వర్గం ఎదగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
‘సింహం’ గుర్తుపై స్వతంత్ర పంథాలో బరిలోకి దిగిన కవిత మద్దతుదారులు, క్షేత్రస్థాయిలో ఆమెకు ఉన్న ప్రజాదరణ మరియు తెలంగాణ జాగృతి ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలే తమ విజయానికి కారణమని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విజయం కవిత రాజకీయ ప్రస్థానానికి కొత్త ఊపిరి పోసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.








‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’