బీఆర్‌ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన సొంత కుమార్తె, ఎమ్మెల్సీ(MLC) కవిత(Kavitha)పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో, ఇప్పుడు కవిత భవిష్యత్ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా కవిత తన సొంత పార్టీ, ముఖ్య నేతలపై బహిరంగంగా విమర్శలు గుప్పించడం కేసీఆర్‌ను ఆగ్రహానికి గురి చేసింది. ప్రధానంగా, కాళేశ్వరం (Kaleswaram) కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సస్పెన్షన్ (Suspension)కు దారితీశాయి. కవిత సస్పెన్షన్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు?
పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై ఇప్పటికే పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ పేరుపై కూడా ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం.
కవిత తన మానస పుత్రిక అయిన తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీగా మార్చే అవకాశం ఉంది. అదే విధంగా కవితకు సన్నిహితంగా ఉండే కొంతమంది బీసీ నేతలు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (టీబీఆర్‌ఎస్) పేరును కూడా ప్రతిపాదించినట్లు సమాచారం.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్