తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు: బీఆర్ఎస్ వైఖరిపై కవిత కౌంటర్

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు: బీఆర్ఎస్ వైఖరిపై కవిత కౌంటర్

తెలంగాణ (Telangana)లో బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ(MLC) కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఈ ఆర్డినెన్స్ (Ordinance) సరైనదేనని, బీఆర్ఎస్ నాయకులు దీన్ని వ్యతిరేకించడం సరికాదని అన్నారు. “బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే” అని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు మద్దతు ఇచ్చానని తెలిపారు.

తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుల మౌనం పట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను” అని ఆమె పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని, డీజీపీని కలిసినట్లు ఆమె తెలిపారు.

“నేను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను” అని కవిత వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత రెండేళ్లుగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తన కృషి ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చిందని కవిత పేర్కొన్నారు. మల్లన్నపై బీఎన్‌ఎస్ 74, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment