శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kashibugga)వెంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన చాలా బాధాకరమని, భక్తుల ప్రాణనష్టం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని (Prime Minister) తెలిపారు. తొక్కిసలాట ఘటనపై పీఎంఓ నుంచి ట్వీట్ చేశారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు ప్రధాని కార్యాలయం (PMO) అధికారికంగా తెలిపింది.








