శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన తరువాత ఆలయ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి మారాయి. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా (Temporarily) మూసివేశారు (Closed). ఆలయ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆలయం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
ఇక ఈ ఘటన నేపథ్యంలో ఆలయ (Temple) ధర్మకర్త (Trustee) పండా (Panda)ను పోలీసులు హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పండాపై కేసు నమోదు కాగా, విచారణలో కీలకమైన అంశాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కలెక్టర్ (Collector) స్వప్నిల్ దినకర్ (Swapnil Dinakar) ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు దారితీసిన కారణాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై ఆ కమిటీ సమగ్రంగా పరిశీలన జరిపి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాశీబుగ్గ చేరుకోనుంది. ఈ బృందం తొక్కిసలాట ఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించనుంది. భక్తుల ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.








