‘కన్నప్ప’ హీరోయిన్ అదరగొట్టేసిందిగా..! ప్రీతి ముకుందన్ లేటెస్ట్ పిక్స్

'కన్నప్ప' హీరోయిన్ అదరగొట్టేసిందిగా..! ప్రీతి ముకుందన్ లేటెస్ట్ పిక్స్

Summarize with AI

టాలీవుడ్‌ (Tollywood)ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొత్త హీరోయిన్లు చాలా మంది తన అందంతో, నటనతో ఆకట్టుకుంటున్నారు. అలా టాలీవుడ్‌కు పరిచయమైన భామే ప్రీతి ముకుందన్ (Preethi Mukundan). ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా (Pan India) సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

కెరీర్ ప్రస్థానం
ప్రీతి ముకుందన్ తన కెరీర్‌ను టీవీ షో (TV Show)లలో నృత్య ప్రదర్శనలతో ప్రారంభించింది. ఈ అందాల భామ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’ (Muthu Mu2) యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి బాగా పేరు పొందింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.

శ్రీవిష్ణు సరసన ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ‘ఓం భీమ్ బుష్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆమె ‘కన్నప్ప’ (Kannappa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కన్నప్ప’లో నెమలి పాత్ర, సోషల్ మీడియాలో సందడి
మంచు విష్ణు (Manchu Vishnu) తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో మరోసారి ప్రేక్షకులను కవ్వించనుంది ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నామధ్య ‘కన్నప్ప’ సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుందని అనౌన్స్ చేస్తూ ఒక అందమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఫోటోలకు కుర్రాళ్లు రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment