బాలీవుడ్ ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీకి అందరూ సమానమే. బాలీవుడ్ తారలు ఆయనను కలవడం వల్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని కంగనా అన్నారు. “నేను మోదీ అభిమానిని. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయనతో మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటాను. ఇండస్ట్రీ గురించి ఆయనతో చర్చించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మోదీకి కళలపై ఉన్న ఆసక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా,” అని కంగనా పేర్కొన్నారు.
రాజ్‌కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ ఫ్యామిలీలోని ప్రముఖులు కరీనా కపూర్- సైఫ్‌అలీఖాన్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్ తదితరులు ప్రధాని మోదీని కలిశారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం నటి కరీనా ప్రధాని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అదే విధంగా ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దొసాంజ్ సైతం ప్రధానిని కలిశారు. ఆ సమయంలో గాయకుడిపై ప్రధాని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.