మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) (MNM) అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఈ నెల 25వ తేదీన రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడిగా (Member) ప్రమాణ స్వీకారం (Oath Taking) చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపికయ్యారు.
రాజకీయ ప్రస్థానం, పార్టీ పనితీరు
2018లో స్థాపించిన MNM పార్టీ, గత ఎన్నికల్లో (2019 సార్వత్రిక, 2021 అసెంబ్లీ, 2022 స్థానిక సంస్థల ఎన్నికలు) చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి MNM మద్దతు ఇవ్వడంతో డీఎంకేతో ఒప్పందం కుదిరి, కమల్‌కు రాజ్యసభ అవకాశం లభించింది.
రజనీకాంత్‌తో సమావేశం
రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ(MP)గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, కమల్ హాసన్ తన స్నేహితుడు, నటుడు రజనీకాంత్ (Rajinikanth)ను నేరుగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటీ “కొత్త ప్రయాణాన్ని స్నేహితుడు రజనీకాంత్‌తో పంచుకున్నాను. సంతోషంగా ఉంది” అంటూ కమల్ పేర్కొన్నారు.