‘క‌ల్కి’కి అరుదైన గౌర‌వం.. IFFM 2024లో చోటు

'క‌ల్కి'కి అరుదైన గౌర‌వం.. IFFM 2024లో చోటు

Summarize with AI

రెబ‌ల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) నటించిన విజువల్ ఎపిక్‌ (Visual Epic) ‘కల్కి 2898ఏడీ’ (‘Kalki 2898 AD’)  తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ఈ చిత్రం తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2024లో ఉత్తమ చిత్రం విభాగానికి నామినేట్ కావడం విశేషం. అంచనాలకు అందకుండా క‌ల్కి సినిమా ఈ నామినేషన్ ( Nominated) అందుకోవడం సినీ వర్గాల్లో హర్షం నింపుతోంది.

IFFM 2024 నామినేషన్స్ జాబితాలో ‘హోమ్ బౌండ్’, ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘మహారాజ్’, ‘స్త్రీ 2’, ‘సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్’ వంటి ఇతర ప్రముఖ సినిమాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14 నుంచి 24వరకూ ఘనంగా జరగనుంది.

ఈ నామినేషన్ ద్వారా ‘కల్కి’ యూనిట్‌కు, ప్రత్యేకంగా దర్శకుడు నాగ అశ్విన్, హీరో ప్రభాస్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, అలాగే మిగతా టీం అందరికీ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్ర‌భాస్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడే ఓ అరుదైన గౌరవం దక్కించుకున్న ఈ చిత్రం, మరి ఫైనల్ విజేతగా నిలుస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment