రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) నటించిన విజువల్ ఎపిక్ (Visual Epic) ‘కల్కి 2898ఏడీ’ (‘Kalki 2898 AD’) తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ఈ చిత్రం తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2024లో ఉత్తమ చిత్రం విభాగానికి నామినేట్ కావడం విశేషం. అంచనాలకు అందకుండా కల్కి సినిమా ఈ నామినేషన్ ( Nominated) అందుకోవడం సినీ వర్గాల్లో హర్షం నింపుతోంది.
IFFM 2024 నామినేషన్స్ జాబితాలో ‘హోమ్ బౌండ్’, ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘మహారాజ్’, ‘స్త్రీ 2’, ‘సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్’ వంటి ఇతర ప్రముఖ సినిమాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14 నుంచి 24వరకూ ఘనంగా జరగనుంది.
ఈ నామినేషన్ ద్వారా ‘కల్కి’ యూనిట్‌కు, ప్రత్యేకంగా దర్శకుడు నాగ అశ్విన్, హీరో ప్రభాస్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, అలాగే మిగతా టీం అందరికీ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఓ అరుదైన గౌరవం దక్కించుకున్న ఈ చిత్రం, మరి ఫైనల్ విజేతగా నిలుస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.








