కాకినాడ జిల్లా (Kakinada District) లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెం–జి.మేడపాడు (Vetlapalem-G. Medapadu) ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో (Firecracker Manufacturing Unit) టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన లో ఇప్పటివరకూ 18 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చుట్టుపక్కల పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఇంకా పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.
ప్రమాదం సమయంలో ఆ కేంద్రంలో సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమైయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురైయ్యారు. ప్రస్తుతం ఘటనా స్థలం అంతా భయానక వాతవరణం గా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి.
Sensitive Visuals
— Telugu Feed (@Telugufeedsite) February 28, 2026
కాకినాడలో భారీ పేలుడు – 18 మంది సజీవ దహనం
పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు
ప్రమాదం సమయంలో 20 మంది ఉన్నట్లు సమాచారం
పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం pic.twitter.com/fhx2BiPDVi








