నిమ‌జ్జ‌నం ముందుగా చేశార‌ని.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ దాడులు

నిమ‌జ్జ‌నం ముందుగా చేశార‌ని.. కదిరిలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ దాడులు

శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లా కదిరి (Kadiri) నియోజకవర్గంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఉద్రిక్తతలు చెలరేగాయి. కదిరి మండలం యాకాలచెరువుపల్లి (Yakalacheruvu Palli)లో టీడీపీ(TDP) నేతలు వైసీపీ(YSRCP) కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి(Attack) చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

స్థానిక సమాచారం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ(TDP) వారి కంటే వినాయక నిమజ్జనం (Immersion) వైసీపీ వారు ముందుగా చేయ‌డం ఈ ఘర్షణకు కారణమైంది. తమకంటే ముందుగా విగ్రహాన్ని నిమజ్జనం చేశారని ఆగ్రహంతో టీడీపీ నేతలు వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇళ్లలోని వస్తువులు, బైకులు ధ్వంసం చేసి, తీవ్ర హింసకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి టీడీపీ నేతలు మతపరమైన వేడుకల్లో కూడా తమను అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. యాకాల‌చెరువుప‌ల్లిలోని గుడిలోకి కూడా త‌మ‌ను అనుమ‌తించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగినా, పోలీసులు మాత్రం ప్రేక్షకుల్లా వ్యవహరించారని వైసీపీ నేతలు మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment