మ‌ళ్లీ కడప ఎమ్మెల్యే కుర్చీ గోల.. క‌లెక్ట‌ర్‌పై చిందులు (Video)

మ‌ళ్లీ కడప ఎమ్మెల్యే కుర్చీ గోల.. క‌లెక్ట‌ర్‌పై చిందులు

కడప జిల్లా (Kadapa District)లో మరోసారి అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే (MLA) మాధవి రెడ్డి (Madhavi Reddy) కుర్చీ వివాదం (Chair Controversy) చర్చనీయాంశమైంది. ఈసారి వేదికగా నిలిచింది పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ (Independence Day) వేడుకలు. పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో త‌న‌కు స్టేజీ(Stage)పై స్పెష‌ల్‌గా కుర్చీ వేయ‌లేద‌ని ఎమ్మెల్యే మాధ‌విరెడ్డి అలిగారు. స్టేజ్‌పై జేసీ (JC) అతిధి సింగ్ (Atidhi Singh) ఉండగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వైపు గుడ్లు ఉరిమి చూస్తూ తనను స్టేజ్‌పై ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ (Cherukuri Sridhar), స్టేజ్‌పైకి రావాలని ఎమ్మెల్యేను కోరినా, ఆమె తిరస్కరించారు. అనంతరం మళ్లీ కూర్చోవాలని కోరినప్పటికీ, ఆమె అంగీకరించలేదు. దీంతో అరగంటకు పైగా నిలబడి, చివరికు పంద్రాగ‌స్టు వేడుక‌ల నుంచి వెనుదిరిగారు. స్టేజ్‌పై ముఖ్య అతిథి మంత్రి ఫరూక్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిధి సింగ్ కూర్చున్నారు. త‌న‌కు స్టేజీపై స్పెష‌ల్ కుర్చీ లేద‌ని ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అధికారుల ప్రకారం, ప్రోటోకాల్ (Protocol) నిబంధనల ప్రకారం స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల్లో ఎమ్మెల్యేలకు స్టేజ్‌పై కూర్చోడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అయితే కుర్చీ ఏర్పాటు చేయకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే కుర్చీ కోసం ఎమ్మెల్యే అల‌క ఇది మొద‌టిసారి కాదు.. గ‌తంలో క‌డ‌ప మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశంలో మేయ‌ర్‌తో పాటు త‌న‌కు స‌మానంగా కుర్చీ వేయాల‌ని పెద్ద గొడ‌వే చేశారు. పంద్రాగ‌స్టు రోజున స్టేజీపై త‌న‌కు కుర్చీ వేయాల‌ని ఎమ్మెల్యే మాధ‌విరెడ్డి అల‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment