కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ వ్యక్తి తన భూమి వివాదానికి పరిష్కారం ద‌క్క‌క‌పోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన సుధాకర్ తన భూమి రికార్డులను పాసుబుక్‌లో నమోదు చేయడం లేదని రెవెన్యూ అధికారులపై ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తన సమస్యను తెలియజేయడానికి వచ్చిన సుధాకర్, న్యాయం జరగడం లేదన్న ఆవేద‌న‌తో కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పరిస్థితిని సమర్థంగా నియంత్రించారు. ఈ ఘటన కలెక్టర్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment