సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో NHRC చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఈనెల 18న సమావేశమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు జస్టిస్ రామసుబ్రమణియన్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
రామసుబ్రమణియన్ నేపథ్యం..
మద్రాస్ లా కాలేజీలో చదివిన జస్టిస్ రామసుబ్రమణియన్ 1983 నుండి 23 సంవత్సరాలు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత మద్రాస్ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, అలాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJ) సేవలు అందించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు మానవహక్కుల రక్షణకు కొత్త దిశను చూపించే బాధ్యతను చేపట్టారు.
జస్టిస్ రామసుబ్రమణియన్ న్యాయపరమైన అనుభవం, నమ్మకంతో దేశంలోని మానవహక్కుల రక్షణకు మద్ధతు ఇస్తారని పలువురు ఆశిస్తున్నారు. ఆయన NHRC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం, భారతదేశంలో మానవహక్కుల అంశాలపై కొత్త దృక్పథాన్ని తీసుకురావడానికిగాను మంచి శకం కావచ్చని అంటున్నారు.