హిట్ హీరోగా కిరీటి? జూనియర్ మూవీ రివ్యూ..

హిట్ హీరోగా కిరీటి? జూనియర్ మూవీ రివ్యూ..

గాలి జనార్థన్ రెడ్డి (Gali Janardhan Reddy) కొడుకు(Son) కిరీటి (Kireeti) హీరో (Hero)గా పరిచయమైన సినిమా జూనియర్ (Junior) విడుదలైంది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలై, టాప్ టెక్నీషియన్స్ కలిసి పని చేశారు. దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి (Radhakrishna Reddy) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కథలో అభి (కిరీటి) అనే యువకుడి జీవితం, అతని తండ్రితో (రవిచంద్రన్) ఉండే సంబంధాలు, కాలేజ్ లో మొదలయ్యే ప్రేమ, ఉద్యోగం, విజయనగరం ప్రయాణం వంటి అంశాలు ఉన్నాయి. కథ కొత్తదనం లేకపోయినా, కామర్షియల్ ఫార్మాట్‌లో కథనం ముందుకు సాగింది.

కిరీటి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు, డాన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ నటనలో ఇంకా అభివృద్ధి అవసరం. శ్రీలీల (Sreeleela) పాటల కోసం మాత్రమే కనిపించింది. జెనీలియా (Genelia) మంచి పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం, సెంథిల్ కుమార్ (Senthil Kumar) సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్. కానీ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో బాగలేదు.

మొత్తానికి జూనియర్ కథ పాతటాతనంతో కూడిన సాదా కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. కిరీటి టాలెంట్ కనబరచినప్పటికీ, కొత్తదనం లేదని చెప్పాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment