బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణం తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో (Jubilee Hills Constituency) ఉప ఎన్నికలు (By Elections) అనివార్యం అయ్యాయి. అయితే తెలంగాణ (Telangana)లో ఉప ఎన్నికపై రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఉప ఎన్నికలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS), అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) మధ్య గట్టిపోటీ నెలకొంటుందని భావిస్తుండగా, జూబ్లీహిల్స్ బరిలో మాజీ గవర్నర్ (Former Governor) బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కూతురు (Daughter) విజయలక్ష్మి (Vijayalakshmi) పేరు బీజేపీ (BJP) జాతీయ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
బీసీ ఓటు బ్యాంక్‌పై కమలం దృష్టి
ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ల తర్వాత యాదవ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన, ముఖ్యంగా మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. విజయలక్ష్మికి టికెట్ ఇస్తే బీసీ వర్గం మద్దతుతో పాటు మహిళా కారకం కూడా కలసి వస్తుందని కమలం అంచనా వేస్తోంది. ఇక బీఆర్ఎస్(BRS) అభ్యర్థి సునీత (Sunitha) (మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య)కి సానుభూతి వాతావరణం ఉండటంతో, బీజేపీ కూడా మహిళా అభ్యర్థిని బరిలోకి దింపితే టఫ్ ఫైట్ ఇవ్వగలమనే వ్యూహంలో ఉంది.
కూతురి కోసం దత్తన్న ప్రయత్నాలు
దత్తాత్రేయ తన రాజకీయ వారసత్వాన్ని కూతురికి అప్పగించేందుకు చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ టికెట్ కోసం ఆయన లాబీయింగ్ చేసినప్పటికీ, చివరకు మరొకరికి టికెట్ దక్కింది. అప్పటి నుంచే భవిష్యత్తులో విజయలక్ష్మికి అవకాశం ఇస్తామని ఢిల్లీ నాయకులు హామీ ఇచ్చారన్న ప్రచారం సాగింది. ప్రస్తుతం కూడా విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే కొంతమంది నేతలు తమ అనుచరులకు టికెట్ ఇవ్వాలని ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.








